శ్రీ శ్రీ శ్రీ చెంచు లక్ష్మీ సమేత పావన నరసింహ స్వామి దేవాలయం
రవ్వలకొండ, బనగానపల్లె.
పుర ప్రజలకు, భక్తాదులకు తెలియజేయడమేమనగా!.
నా దృష్టికి వచ్చిన కొన్ని అసందర్భిత వార్తలకు వాస్తవము ఏమిటో తెలియపరచుచున్నాను.

నేను నా జీవితమును నరసింహస్వామికి అంకితము చేసి ఆ భగవంతుని ఆశీర్వాద బలంతో ఎన్నో కష్టములకు వోర్చి యీ గుడిని నిర్మాణము గావించాను. ఈ గుడి నిర్మాణసమయములో మిత్రులు,శ్రేయోభిలాషులు,భక్తులు నాకు ఆసరాగా నిలిచారు. వారందరికి యీ సంధర్బముగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈ గుడికి సంబందించిన స్థలము ఎవరు దానము చేయలేదు. నా స్వయం ఆర్జితముతో కొన్నది. గుడి నిర్మాణములో కొందరు భక్తులు,మిత్రులు,శ్రేయొభిలాషులు,బందువులు ధన రూపేణ,వస్తురూపేణ సహాయము చేసిన, అధికభాగం భగవంతుడు నాకు యిచ్చిన సంపదతోనే నిర్మాణము చేశాను. ఇది అంతయు మీకు ఎందుకు తెలియ పరచుతున్నానంటే, కొన్ని అసత్య ప్రచారములు నిజము కాదని తెలియపరచడానికి.
1. రవ్వలకొండపై నిర్మించిన నరసింహస్వామి ఆలయ స్తలము నా స్వంతము.
2. ఈ ఆలయము టిటిడి వారికి ఎటువంటి సంబందములేదు మరియు వారికి ఎటువంటి హక్కులేదు. వారి నుంచి ఎటువంటి నిధులు పొందలేదు.
3. హిందూ పరిషత్తు లేదా ఇలాంటి హిందూ లేదా ధార్మిక సంఘాలకు హక్కులేదు మరియు ఎటువంటి లావాదేవీలు లేవు.
4. సమరస పౌండేషన్ వారిదని జరుగుతున్న ప్రచారము కేవలము పుకారు మాత్రమే.
5. ఇలా ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్ని కేవలము అభూత కల్పనలు. వాటిని నమ్మకండి.
6. చందాలు వసూలు చేయుటకు మేము ఎవరిని నియమించలేదు.
కావున ఎవరైన రవ్వలకొండ నరసింహస్వామి పేరుతో పూజలు చేస్తున్నామని కాని, కార్యక్రమాలు చేస్తున్నామనికాని వచ్చి చందాలు అడిగినచో నిజనిర్దారన చేసుకోండి. అటువంటి వారి వివరాలు మాకు తెలియజేసిన,చట్టపరమైన చర్యలు తీసుకొనగలము.
ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాకు పోనుచేయండి.


ఇట్లు,
బాలిశెట్టి పావన నరసింహ మూర్తి. ( ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, నిర్మాణ కర్త ,అర్చకులు. )

శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయం
రవ్వలకొండ,బనగానపల్లె-518124,కర్నూలు జిల్లా
ఈ దేవాలయములో పూజకార్యక్రమ వివరాలు

1. ప్రతి స్వాతికి శ్రీనరసింహస్వామి మనొభీష్ట పూజావ్రతం సామూహికముగా నిర్వహించబడును. సమయము ఉదయం 9 గంటలకు ప్రారంభించబడును.
2. శ్రీ నరసింహస్వామి సగుణమంజరి ప్రతి శనివారము మరియు స్వాతి రోజు సామూహిక పారాయణము నిర్వహించబడును.సమయము ఉదయం 9 గంటలకు ప్రారంభించబడును.
2. శుభదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించబడును.
భక్తులకు ఈ కార్యక్రమాలలో పాలుపంచుకునే అవకాశము కల్పిస్తున్నాము.
*నిత్య ధీపారాధనం: Rs1016/- లు ఒక సంవత్సరానికి చెల్లించి స్వామి కృపాకటాక్షములు పొందండి. ప్రతి రోజు మీ గోత్రనామాలాతో అర్చన సంవత్సరము పాటు నిర్వహించబడును.
*స్వామి స్వాతాభిషేకము: Rs 1216/-లు చెల్లించిన సంవత్సరములో వచ్చు ప్రతి స్వాతికి స్వామివారికి మీగోత్రనామాలతో అభిషేకము జరిపించబడును.
* అన్నదానం: ప్రతి స్వాతికి అన్నదాన నిర్వహించబడును. Rs 2116/-లు చెల్లించిన ప్రతి స్వాతికి మీ గోత్రనామాలతో ఒక సంవత్సరము పాటు నిర్వజించబడును.
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేవాలయములో జరుగుతున్నాయి. అందుకు మీ వంతు సహాయము చేసి శ్రీ స్వామివారి కృపాకటాక్షములతోపాటు మీమనొభీష్టాన్ని సిద్ధించుకోగలరు.
పూర్తివివరాలకు ఈ క్రిందివారిని సంప్రదించగలరు

బాలిశెట్టి పావన నరసింహమూర్తి                                                                                                                                                                                                యాపర్ల లక్ష్మినారాయణ రెడ్డి
ఆలయ వ్యవస్థాపకులు & అర్చకులు                                                                                                                                                                                                 పరిపాలనా విభాగం
9951773665                                                                                                                                                                                                                                           9885526478

ప్రొద్దుటూరు పట్టణంలో విజయేశ్వరి వృద్ధాశ్రమం నందు 10-01-2021 న ధ్యాన శిక్షణ- ధ్యాన సాధన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ చెంచు లక్ష్మి సమేత పావన నరసింహ స్వామివారి చిత్రపటం ( బనగాన పల్లె) ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము నకు శ్రీ ధర్మతేజ గారు , శ్రీ V.M. భాస్కర్ రాజు గారు (Rtd.తెలుగు పండిట్) శ్రీ గాయత్రి సేవా సమితి అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు శ్రీ G.V.కృష్ణయ్య గారి సమక్షము లో శ్రీ పావన నరసింహ మూర్తి (ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు,మరియు అర్చకులు బనగాన పల్లె) ఆధ్వర్యములో జరిగింది.

దేవాలయ ప్రాంగనములో పాఠించవలసిన నియమాలు

స్నానము చేసినవారు మాత్రమే దేవాలయ ప్రాంగనములో ప్రవేశించుటకు అర్హులు
పాదరక్షలు దరించి దేవాలయ ప్రాంగనములో తరగరాదు
ఉచిత సలహాలు యివ్వకండి - చేతనైతే సేవచేయండి
మీరు ఏమి చెప్పాలనుకున్నారో ఆ పనిచేయండి మీ పేరు వేసుకొండి
దేవాలయ ప్రాంగనములో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు
పర్సరాలు పరిశుభ్రముగా వుంచండి
నీళ్ళటాంకు దగ్గర బట్టలు ఉతకరాదు
అనవసరంగా మాట్లాడరాదు- మౌనం పాఠించవలెను
ప్రతి హిందువు విశ్వహందూ పరిషత్తు సభ్యుడే