విజ్ఞప్తి
స్వామి వారి భక్తులకు విన్నపము
రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ వ్రత పుస్తకము ఈ దేవాలయము తరపున ప్రచురిస్తున్నాము. ఈ పుస్తక ప్రచురణలో మీ సహకారము కోరుతున్నాము. పుస్తక ప్రచురణలో సహకరించిన వారి వివరాలు యీ పుస్తకములో ప్రచురించబడును.
వివరాలకు ఆలయ కార్యనిర్వహకులను సంప్రదించగలరు.
రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ
ప్రస్తావన
పవిత్రాత్ములైన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి భక్తులకు,సేవకులకు స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళల లభించాలని ప్రార్థిస్తూ-మా నమ: శుమాంజలులు.
మానవునిగా ప్రతివారికి ఏదో వెలితి. ఆర్థికంగా కావచ్చు,కుటుంబ సమస్యలు కావచ్చు,విద్య,ఆరోగ్య,సంతానము మొదలగు ఎన్నో సమస్యలతొ సతమతమవుతున్నారు. ప్రశాంతత లేదు.. మనస్సును ఊరట పరచేందుకు మార్గము లేదు. ఈ విషయాలను పరిశీలించిన పిమ్మట నా మిత్రుడు యాపర్ల లక్ష్మినారాణ రెడ్డితో అలోచన చేసేవాడిని. స్వామివారి ఆశిస్సులతో మా ఆలోచనలకు ఒక రూపకల్పన చేశాము.ఆ రూపకల్పనే "రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ". ఈ పూజ విదానానికి యాపర్ల లక్ష్మీనారాయణరెడ్డిగారు రచన సహకారము అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కృపాకటాక్షములు లభించుగాక.పూజావిదానము పూర్తిగ అందిస్తున్నాము. ఈ పూజను మీరే మీ ఇంటిలో స్వయంగా ఆచరించ వచ్చును. ప్రతి స్వాతికి యీ పూజను శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయం, రవ్వలకొండ, బనగానపల్లె, కర్నూలు జిల్లా నందు నిర్వహిస్తున్నారు. యీ పూజ వివరాలకు శ్రీనరసింహ మూర్తి,అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులు (9951773665)ను సంప్రదించవచ్చును.
ఈ పూజను ఒకసారి ఆచరించి చూడండి. స్వామివారి కృపాకటాక్షములు పొందండి.
-శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి,అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులు
పూజా విదానము
- స్వామి వారికి ప్రీతికరమైన దినము స్వాతి. కావున స్వాతి రోజున యీ పూజ కార్యక్రమము ప్రారంభము చేస్తే పలితము తొందరగా లభిస్తుంది .
- ఈ పూజను మీరే మీ ఇంటిలో స్వయంగా ఆచరించ వచ్చును. ప్రతి స్వాతికి శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయం,రవ్వలకొండ,బనగానపల్లె,కర్నూలు జిల్లా నందు కూడా నిర్వహిస్తున్నారు. వివరాలకు శ్రీనరసింహ మూర్తి,అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులు (9951773665)ను సంప్రదించవచ్చును.
- ఈ పూజను ఎవరైన చేయవచ్చును. కుల మత తారతమ్యాలు లేవు. లింగభేదము లేదు. వృద్దులు,పురుషులు,స్త్రీలు,పిల్లలుకూడ ఆచరించవచ్చును.
- పూజ నిర్వహించుకునే రోజు మాత్రము మధ్యము,మాంసము,జూదము,వీలైతే వినొదకార్యక్రమలకు (సినిమా,టి.వి.మొదలగునవి) దూరంగా ఉండాలి.అలగే దాంపత్య సుఖానికి దూరంగా వుండాలి.
- ప్రతి స్వాతి పూజ రోజు ఒక్క రూపాయి (ఎక్కువ కూడ ఉంచవచ్చును) దక్షిణ ఉంచాలి. ఈ దక్షిణను మీ సమీప శ్రీనరసింహస్వామి దేవాలయ హుండీలో వేయాలి.
- ప్రతి పూజకు ఒక పుస్తకము తప్పనిసరిగా దానము చేయాలి.మీకు కుదురితే ఎక్కువ పుస్తకాలు కూడ దానము చేయవచ్చును.
- పుస్తకముతోపాటు ఒక పోటో మరియు పోస్టుకార్డు కూడా ఉంటాయి.పొటో పూజకొరకు ఉపయోగించాలి. పోస్టుకార్డు మీద మాత్రము మీ పేరు గోత్రము రాసి పంపండి.
8. మీ స్వాతి పూజను మీ మనొభీష్టము నెరవేరే వరకు ఆచరించ వలెను. . తప్పకుండ మీ సంకల్పము నెరవేరుతుంది.
9. ప్రతి స్వాతికి ఒక అధ్యాయము తప్పక పారాయణం చేయాలి. మీకు కుదిరితే అన్ని అధ్యాయలు పారాయణం చేయవచ్చును. . అలా 11 స్వాతులు యీ పూజ కార్యక్రమము నిర్వహించాలి.
10. ఈ పూజకు సంబందించిన పుస్తకాలు శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయం, రవ్వలకొండ, బనగానపల్లె,కర్నూలు జిల్లా నందు లభిస్తాయి. కావలసినవారు శ్రీనరసింహ మూర్తి,అర్చకులు మరియు ఆలయ కార్యనిర్వాహకులు (9951773665)ను సంప్రదించవచ్చును.
పూజకు కావలసిన పూజా సామాగ్రి
- పూజా పుస్తకము
- స్వామివారి పటము (పూజా పుస్తముతోపాటు వస్తుంది)
- మీ కులదేవతల పటాలు/ప్రతిమలు కూడ ఉంచుకోవచ్చును.
- శుభమైన వస్త్రము (దేవతల పటాలు,పూజా సామాగ్రి పెట్టుకొనుటకు)
- పటాలకు సరిపడు పూలమాల మరియు విడిపూలు
- దక్షిణ
- ధీపం కుందు,వత్తులు,నూనె,అగరత్తులు మరియు కర్పూరము
- టెంకాయ మరియు అరటి పండ్లు
- దానము యివ్వడానికి ఒక పుస్తకము.
10. నైవేధ్యము (మీకు ఇష్టమైన ఏదైనా సరే)
పూజ ప్రారంభము
విన్నపము
పవిత్రాత్ములైన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి భక్తులకు,సేవకులకు స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళల లభించాలని ప్రార్థిస్తూ-మా నమ: శుమాంజలులు.
నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. స్వామి ఆశిస్సులతో యీ పూజా విదానానికి రచన మరియు రూపకల్పనకు సహకారము అందించాను.
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలాయ కార్యనిర్వహకులైన శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారు నాకు స్నేహితులు మరియు బనగానపల్లెలో ఇద్దరము కలిసి ఒకేచోట కొంత కాలము పనిచేశాము. వీరు అన్ని విషయాలు నాతో చర్చించేవారు. దేవాలయ నిర్మాణము, వెబ్ సైట్,యాప్ గురించి కూడ నాతో ఆలోచించేవాడు. భక్తులకు ఏదైనా కొత్తగా చేయాలి-అందరూ స్వామివారి సేవలో తరింపజేయాలని తపించిపోయేవాడు. ఆ సంధర్బములోనే మాకు స్వామివారు ఒక ఆలోచన పుట్టించాడు. సాధారణమైన మరియు సరలమైన ఒక పూజా విదానాన్ని తయారుచేయడం జరిగింది. అదే "రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనోభీష్ట పూజ". ఈ పూజ అన్ని వ్రతాలకు బిన్నంగా స్వామివారి కృపాకటాక్షలు మరియు మనోభీష్టం సిద్ధించుకునేలా రూపొందించడం జరిగినది. స్వాతిరోజు మాత్రమే యీ పూజచేసుకునేలా,నిబందనలు కూడా ఆ రోజు పాటించేలా, అలా 11 స్వాతుల పూజావిదానాన్ని రూపకల్పన చేయబడింది. అన్ని స్వాతులు చేయాలన్న నిబందన లేదు. మద్యలో మానివేసిన ఏమికాదు.
ఈ పూజను ఒకసారి ఆచరించి చూడండి. స్వామివారి కృపాకటాక్షములు పొందండి.
-యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
రచయిత
