2018 వ సంవత్సరము నుంచి శ్రీనరసింహస్వామివారికి కళ్యాణ మహోత్సము నిర్వహిస్తున్నాము.

కర్నూలు జిల్లా బనగానపల్లె,రవ్వలకొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి వారికి 2018 నుంచి కళ్యాణము భక్తుల సహకారంతో ఆలయ కమిటీవారు వైభోపేతముగా నిర్వహిస్తున్నారు. అలాగే 25-03-2021న సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించుటకు ఆలయ కమిటి తీర్మానించినది.కావున భక్తులు సేవకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదముచేయుటకు సహకరించి, స్వామివారి కృపాకటాక్షములు పొందవలసినదిగ పత్రికా విలేఖురుల సమావేశములో ఆలయవ్యవస్థాపకులు,ధర్మకర్త మరియు అర్చకులు అయిన బాలిశెట్టి పావన నరసింహమూర్తిగారు తెలియజేశారు.

విజ్ఞప్తి
స్వామి వారి భక్తులకు విన్నపము
రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ వ్రత పుస్తకము ఈ దేవాలయము తరపున ప్రచురిస్తున్నాము. ఈ పుస్తక ప్రచురణలో మీ సహకారము కోరుతున్నాము. పుస్తక ప్రచురణలో సహకరించిన వారి వివరాలు యీ పుస్తకములో ప్రచురించబడును.
వివరాలకు ఆలయ కార్యనిర్వహకులను సంప్రదించగలరు.

23-08-2019శ్రీకృష్ణాష్టమిని పురష్కరించుకొని, ఈ దేవాలయము నందు ఉదయము 8గంటలకు పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట సామూహిక పూజ నిర్వహించబడును. స్వామివారి కృపాకటాక్షములు మరియు మీ మనొభీష్టం పొందగోరువారందరు ఈ పూజలో పాల్గొనవలెను.
పూజలొ కూర్చొనువారు ఈ క్రింది పూజా సామాగ్రి తెచ్చుకోవలయును.
1. శుభమైన వస్త్రము (దేవతల పటాలు,పూజా సామాగ్రి పెట్టుకొనుటకు)
2. పటాలకు సరిపడు పూలమాల మరియు విడిపూలు
3. ధీపం కుందు,వత్తులు,నూనె,అగరత్తులు మరియు కర్పూరము
4. టెంకాయ మరియు అరటి పండ్లు

07-08-2019 వ తేది స్వాతిని పురష్కరించుకొని

ప్రత్యేక పూజాకార్యక్రమములు కలవు.

మరియు సాయంత్రము శ్రీవారి కళ్యాణోత్సవము కలదు

20-04-2019 స్వాతిని పురష్కరించుకొని 
ఈ దేవాలయములో యీ కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ హాజరై జయప్రదముచేయగలరు.
1.  ఉదయము 06 నుంచి స్వామివారికి ప్తత్యేక పూజా కార్యక్రమాలు కలవు.
2. తిరుమల తిరుపతి దేవస్థానము వారి సౌజన్యముతో  ఊదయం 08 గంటలకు నుంచి " తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమము " నిర్వహించబడును.

3.శ్రీ రామశేషయ్య గారిచే ఉదయం 10 గంటల నుంచి భక్తి ప్రవచానాలు కలవు.
4. తదనంతరము అన్నవితరన కలదు.
భక్తులందరూ హాజరై పై కార్యక్రమాలలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.
ఇట్లు
ఆలయ నిర్వాహకులు & కమిటి
శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి దేవాలయము
రవ్వలకొండ,బనగానపల్లె

*********/********************

27-04-2019 నరసింహస్వామి వారాలను (మూడవ శనివారము) పురష్కరించుకొని ఉదయము 06 గంటల నుంచి ఈ దేవాలయములో ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ హాజరై జయప్రదముచేయగలరు.
 ఉదయం 10 నుంచి 12 వరకు   డాక్టర్ Y.V.సూర్యప్రకాశ రెడ్డి M.D.(ఊపిరి తిత్తుల నిపుణులు) గారి సహకారముతో ఉ చిత మెడికల్ చెకప్ నిర్వహించబడును.

pavana.mp3