రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

8 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి

 

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ: II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

8 వ స్వాతి కథ

 ప్రహ్లాదుడు తండ్రిగారి ఆదేశము ప్రకారము మరల గురువులవెంట ఆశ్రమానికి వస్తాడు. రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయసాగాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు అనిచెప్పిరి.హీరణ్యకశిపుడు పహ్లాదుని పిలిపించి ' ఆచార్యులు చెప్పింది నువ్వు వినటంలేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు; నీ వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చిమాటలతో పొగడుతున్నావు; మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ బూడిదపాలు చేశావు; నువ్వు కులద్రోహివి; మూఢుడివి; నీచుడివి; నీవంటి వాడిని చంపడమే మంచిపని. నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను.ఓరీ! అన్ని దిక్కుల చివర్ల వరకూ ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలుకులు అందరూ ఏ దిక్కూలేక ఇప్పుడు నన్నే దిక్కని తలచి మ్రొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో.
అలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. ' ఓ మహనీయుడైన తండ్రి గారు! ఈ దేశకాలాదుల ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.నాన్నగారూ! ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ ప్రభువు విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు నిధి. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్నిసృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికి “చిత్తం, చిత్తం” అంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పటం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటం లేదు.నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు. మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు; కర్మ బంధాలను త్రెంచివెయ్యి; భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరచుకో; నిరంతంరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి అని పలికాడు పరమ భక్తశిఖామణి ప్రహ్లాదుడు.
దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తు అంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు.

అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేసాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు. నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా,ఇలా భగవంతుడు సర్వవ్యాపి అని కొడుకు ప్రహ్లాదుడు చెప్పగా, తండ్రి హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు. ఓరి డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి. నువ్వు చెప్పినట్లు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే, ఎలాగూ నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను కదా. అప్పుడు నిన్ను కాపాడటానికి విష్ణువు రాగలడా? అడ్డు పడగలడా?” అలా తండ్రి పెద్దగా గద్దించాడు. భక్తవత్సలుని పరమ భక్తుడైన ఆ ప్రహ్లాదుడు ఇలా పలికాడు.

“ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డిపరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు ”అలా అనే సరికి హిరణ్యాక్షుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసాడు. చివాలున లేచి సింహాసనం మీంచి క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు. “ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి,భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికి పుస్త్రకదానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదనము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.