రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము

9 వ స్వాతి మనొభీష్ట పూజ

పూజ ప్రారంభము

                     ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము

ప్రార్థన

శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే

(తెల్లని వస్త్రములతో  అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని  ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో  ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)

శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)

శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -

సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||

( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో  చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

సంకల్పం

(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు  ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)

ధ్యానము

(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)

శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి

(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి

 

ఓం నారసింహాయ నమః

ఓం మహాసింహాయ నమః

ఓం దివ్య సింహాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం ఉగ్ర సింహాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం స్తంభజాయ నమః

ఓం ఉగ్రలోచనాయ నమః

ఓం రౌద్రాయ నమః

ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||

ఓం శ్రీమతే నమః

ఓం యోగానందాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం హరయే నమః

ఓం కోలాహలాయ నమః

ఓం చక్రిణే నమః

ఓం విజయాయ నమః

ఓం జయవర్ణనాయ నమః

ఓం పంచాననాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 20 ||

ఓం అఘోరాయ నమః

ఓం ఘోర విక్రమాయ నమః

ఓం జ్వలన్ముఖాయ నమః

ఓం మహా జ్వాలాయ నమః

ఓం జ్వాలామాలినే నమః

ఓం మహా ప్రభవే నమః

ఓం నిటలాక్షాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం దుర్నిరీక్షాయ నమః

ఓం ప్రతాపనాయ నమః || 30 ||

ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం చండకోపినే నమః

ఓం సదాశివాయ నమః

ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః

ఓం దైత్యదానవ భంజనాయ నమః

ఓం గుణభద్రాయ నమః

ఓం మహాభద్రాయ నమః

ఓం బలభద్రకాయ నమః

ఓం సుభద్రకాయ నమః || 40 ||

ఓం కరాళాయ నమః

ఓం వికరాళాయ నమః

ఓం వికర్త్రే నమః

ఓం సర్వర్త్రకాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం ఈశాయ నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం విభవే నమః

ఓం భైరవాడంబరాయ నమః || 50 ||

ఓం దివ్యాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం కవయే నమః

ఓం మాధవాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం అక్షరాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం వరప్రదాయ నమః

ఓం అధ్భుతాయ నమః ll 60 ll

ఓం భవ్యాయ నమః

ఓం శ్రీవిష్ణవే నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అనఘాస్త్రాయ నమః

ఓం నఖాస్త్రాయ నమః

ఓం సూర్య జ్యోతిషే నమః

ఓం సురేశ్వరాయ నమః

ఓం సహస్రబాహవే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః 

ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II

ఓం వజ్రదంష్ట్రయ నమః

ఓం వజ్రనఖాయ నమః

ఓం మహానందాయ నమః

ఓం పరంతపాయ నమః

ఓం సర్వమంత్రైక రూపాయ నమః

ఓం సర్వమంత్ర విధారణాయ నమ:

ఓం సర్వతంత్రాత్మకాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సువ్యక్తాయ నమః 

ఓం భక్ర వత్సలాయ నమ: II80II

 ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః

ఓం శరణాగత వత్సలాయ నమః

ఓం ఉదార కీర్తయే నమః

ఓం పుణ్యాత్మనే నమః

ఓం మహాత్మనే నమ:

ఓం దండ విక్రమాయ నమః

ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః

ఓం భగవతే నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||

ఓం శ్రీనివాసాయ నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగన్మయాయ నమః

 ఓం జగత్పాలాయ నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం మహాకాయాయ నమః

ఓం ద్విరూపభ్రుతే నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరజ్యోతిషే నమః

ఓం నిర్గుణాయ నమః || 100 ||

ఓం నృకేసరిణే నమః

ఓం పరతత్త్వాయ నమః

ఓం పరంధామ్నే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం లక్ష్మీనృసింహాయ నమః

ఓం సర్వాత్మనే నమః

ఓం ధీరాయ నమః

ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II

ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

9 వ స్వాతి కథ

  

ప్రహ్లాదుని విష్ణు భక్తి వలన హిరణ్యకశిపుడు మరింత శత్రుత్వం పెంచుకున్నాడు. అతని మనస్సు రోషంతో కుతకుతలాడిపోతున్నది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము,అణుకువలను కాల్చివేఅశాయి. తామస గుణం వల్ల పట్టలేని ఆవేశింతో ప్రహ్లాదునిపై హుంకరించి,'ఈ స్తంభములో చూపించ ' అంటూ తన గధతో బలంగా మోదాడు. అంతే ఆ స్తంభము ఫెళఫెళమని భయంకర ధ్వని చేసింది.సంస్తము లోకం ఒక్కసారి ఉలిక్కిపడింది. స్తంభము చిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, పర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. ఇంద్రధనుస్సులా వంగి ఉన్న ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి.శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీరకాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నాయి. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ, హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.చిన్న పిల్లాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్ముకుడ నని నిరూపించడానికి, విష్ణువు ఇలా నరసింహరూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు

అప్పుడు, గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చే విధంగా, నృసింహావతారుడు ఆగ్రహంతో వజ్రకఠోరకాయుడూ; అచంచల ఉత్సాహవంతుడూ; మహాబాహుడూ; ఇంద్ర అగ్ని యమాదులకు మిక్కిలి భయం పుట్టించేవాడూ; దానవవంశ శుభంకరుడూ; దుస్సహ పరాక్రమం గలవాడూ అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడేసుకొన్నాడు. వాడి రొమ్ము తన వాడి గోళ్ళతో చీల్చాడు.

ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు.

నైవేధ్యము

నైవేధ్యము స్వామివారికి సమర్పించి టెంకాయ కొట్టండి

నీరాజనము (హారతి)

(కర్పూరముతోగాని నూనెవత్తులతోగాని హారతి యివ్వవచ్చును)

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి 
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఎవరైతే యీ పూజ ఆచరించాలనుకుంటారో వారికి పుస్త్రకదానము చేయండి

ఆన్ని దానలలొకెల్ల విధ్యాదనము,అన్నదానము గొప్పది. ఇంతటితో యీరోజు స్వాతిపూజ ముగిసింది.