కార్యనిర్వాహకులు శ్రీ బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారి గురించి

తల్లి: కీర్తిశేషులు శ్రీమతి సుబ్బనరసమ్మ

ఈమె ఆలయ కార్యనిర్వాకులైన బాలిశెట్టి పావన నరసింహమూర్తి గారి మాతృమూర్తి కీర్తిశేషులు శ్రీమతి బాలిశెట్టి సుబ్బనరసమ్మ గారు. వీరి పేరుమీదుగానే ఈ ఆలయ నిర్మాణము చేసినారు. మరియు "అమ్మ" ట్రస్టు ఏర్పాటు చేసి,ఎన్నో ధర్మకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి యే నమః . బనగానపల్లె మండలము లో రవ్వల కొండ పై స్వయం వ్యక్త శ్రీ పావన లక్ష్మీ నరసింహ స్వామి పుట్టుశిల వెలసిన ప్రాంతము లో గుడి నిర్మాణము వెనుక కొంత చరిత్ర ఉన్నది. ఎక్కడో కడప లో నివసించు చున్న సుబ్బ నరసమ్మ, నరసింహులు  గార్కి పావన నరసింహ మూర్తి రెండవ  సంతానముగ 27-02-1962 న జన్మించారు. పావన నరసింహ మూర్తి గారు తన విద్యా భ్యాసం మొత్తము కడప మరియు పులివెందుల లో  సాగింది.  

తరువాత ఉద్యో గా ర్థి యై బనగానపల్లె కు వచ్చి అక్కడి  పెండేకంటి వెంకట సుబ్బయ్య ఐ.టి.ఐ. యందు ఇన్స్ట్రక్టర్ గా 1986 నుండి 1995 వరకు పని చేశారు.  లక్ష్మినారాణరెడ్డి (ఐ.టి.ఐ.ప్రిన్సిపాల్) గారికి ఆప్తమిత్రుడుగా ఉంటూనే రంగయ్యశెట్టి మరియు ప్రసాదరావు గారితొ ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటూ ఉండేవారు.
అక్కడ పనిచేస్తున్న సమయములోనే MA, B.Ed పూర్తి చేసి, ప్రభుత్వ పాఠశాలలొ ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. వీరి శిశువు పుట్టక మునుపే గతించడం, కొంతకాలానికి భార్య వియోగము తర్వాత తండ్రిగారు కూడ కాలం చేశారు. మరో వివాహము చేసుకోకుండ తల్లి గారిని సేవ చేసుకుంటూ కాలం గడపసాగారు. అటు వంటి సమయములొ దైవం పట్ల పూర్తిగా ఆకర్షితుడై, పావన నరసింహస్వామికి పరమ భక్తునిగా మారారు.   

2011 లో ఒక వెండి విగ్రహం (2.5 kg Rs 1.64 lakhs ) దిగువ అహోబిలం లోనీ అప్పటి EO గారైన నరసయ్య గారికి అందజేయడం జరిగింది .తరువాత ఎగువ అహోబిలం లో గుడి వెనుక భాగంలో ఒక చిన్న విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఆ విగ్రహం ఇప్పుడు రోజూ కొన్ని వందల మంది తో పూజలందుకుంటున్నది.

స్థల పురాణము

బనగానపల్లె మండలము రవ్వ ల కొండ పై వెలసిన స్వయం వ్యక్త (పుట్టు శిల ) శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత పావన లక్ష్మీ నరసింహ స్వామి వారి చరణార విందములకు నమస్కరించి, గుడి నిర్మాణ కర్త ,అర్చకులు, అయిన శ్రీ పావన నరసింహ మూర్తి గారి ఆత్మావలోకనం వారి మాటల లోనే ,.......  

A.S. రంగయ్యశ్రేష్ఠి

నా బాల్యము అంతయు కడప,పులివెందుల లోనే గడిపి నాను . కడప లో ఆరు నుండి పది వరకు చదివాను అప్పుడు హరినాథ్ ( ప్రస్తుత జిల్లా జడ్జి, హైదరాబాద్) అను మిత్రునితో కలిసి మెలసి చదువంటే ప్రాణ మంటూ పోటీపడి చదివే వాళ్ళం. .తల్లిని మించిన దైవం లేదు అని దృఢం గా నమ్మాను .  పులివెందుల లో గూడూరు వెంకట చల మయ్య   మిత్రుడయ్యాడు  తర్వాత ఆప్తమిత్రుడయ్యాడు. .నా తల్లి సేవ లో అతను కూడా చాలా సహాయ సహకారాలు అందించారు .అపుడను కొన్నాను దేవుడు ఎక్కడో లేడు,మానవత్వము ఉన్న తల్లి లోనూ నా మిత్రుల లోనూ దాగి ఉన్నాడ ని.అందుకే బనగానపల్లె యందు తల్లి సేవలోనే గడిపాను .ఆమె తరువాత మిత్రులలో దైవాన్ని వేదక్కుంటు ప్రతి స్వాతి కి అహోబిలం వెళ్ళడం, మిగిలిన కాలమంతా మానవ సేవయే మాధవ సేవ అంటూ గడుపు తున్నపుడు ,  ఒకసారి స్వాతికి పావన (పాములేటి )నుంచి తిరుగు ప్రయాణంలో ఒక వ్యక్తి నాతో సూమారు 7 కి.మీ. ప్రయాణము చేశారు. మా మద్య నరసింహస్వామి గురించి మరియు బనగానపల్లెలో స్వామి వారి దేవాళయం గురించి చర్చ సాగింది.దైవం మీద బారం వేసి నిర్మాణం మొదలు పెట్ట మన్నారు. ఆయన మాటలపై విశ్వాసముతో యెట్లైన సరే గుడి కట్టాలని సంకల్పించుకున్నాను.  .  . . 

.అప్పుడు   మిత్రులు కూడా ప్రోత్స హించడం తో 06-02-2014 న రథ సప్తమి నాడు డాక్టర్ వై.వి. సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డాక్టర్ సి.శ్రీనివాసులు గారు,శ్రీ. జి.వెంకట కృష్ణ య్య ,మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి సుశీల గారు ,   ,శ్రీ గోపాల్ దాస్ గారు  &  శ్రీ పెరుసోముల రామమోహన్ స్వామి గారి సమక్షం లో  

రాజేష్ బ్రదర్స్ గారి చే భూమి పూజ చేయడం జరిగింది .అప్పటి నుండి ఆ స్థలములో ఎన్నో విశేషములు కనిపిస్తూ ఉండినవి . 

సుజాతమ్మ గారి సమక్షములో,పుట్టు శిల బయట పడటం,పాము పుట్ట,అందులో ఎనిమిది అడుగుల పాము, మూడు అడుగుల పాము, కనిపించడం, నిర్మాణం మొదలవగానే రాళ్ళు తోలు ట్రాక్టర్ డ్రైవర్ మొదట భగవానుని చేత సురక్షితముగా అనుగ్రహి హింప బడటం , తక్కువ లోతు లోనే బోరు లో నీరు పడటం ,

B V M V ప్రసాదరావు

పుట్టుశిల ను దర్శించు కొను వారికి వారి వారి ఇష్ట దైవం లా వారికి కనిపించడం, అంధు రాలికి చూపు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, సంతాన భాగ్యం కల్పించడం భూమి పూజ నుండే అఖండ జ్యోతి తో పూజ లందు కొంటూ ప్రతిష్టకు ముందే ఎందరికో ఎన్నో విధములు గా స్వామి వారు మహిమలు చూపి అనుగ్రహించారు.19-08-2017 న స్థిర ప్రతి ష్టు లైనారు .  అజ్ఞానవ్యక్తి మాటల చైతన్యముతోను, స్వామివారి ఆశీర్వాధబలం,భక్తులు,దాతల సహకారముతో నేను ప్రారంభించిన యజ్ఞము పూర్తిచేయగలిగానుఅప్పుడనిపించింది నాతో నడిచింది, ఈ కార్యక్రమాలన్ని పూర్తిచేయించింది సాక్షాత్తు చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామియేనని.

17-08-2018 న ధ్వజస్థంభ ప్రతిష్ఠ మరియు ప్రథమ శ్రీ వారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవముగా జరిగినది

17-03-2019 న ద్వితీయ శ్రీ వారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవముగా జరిగినది
బెంగలూరు,కడప,ప్రొద్దుటూరు,హైదరాబద్ మరియు అనేక వివిద ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులైనారు

పూజారులతో