శ్రీ పావన నరసింహస్వామి స్తుతి మాల

రచన: యాపర్ల లక్ష్మీనారాయణ రెడ్డి

1

మేలుకో మేలుకో శ్రీనరసింహ
మేలుకో  మేలుకో శ్రి మహా సింహ

జయవిజయుల శాపము తీర్చుటకై
హిరణ్యాక్షున్ని కడతేర్చి, సాగరమున
భువిని కాపాడిన  శ్రీవరాహనరసింహ
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

ప్రహ్లాదుడిచ్చిన మాటను నిజము చేయుటకై
సగము మనిషి సగము మృగము శ్రీనరసింహుడవై
హిరణ్యకశిపునున్ని చీల్చిచెండాడిన శ్రీఉగ్రనరసింహ
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

పాలకడలిలో అనంతునుని పానుపుగ చేసుకొని
దుష్టుల తుదముట్టించే సుదర్శనదారి చక్రధారి
భక్తసులభ వైకుంఠవాస శ్రీలక్ష్మీప్రియ
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

శ్రీలక్ష్మీహృదయదారి శ్రీలక్ష్మీనరసింహా
చెంచులక్ష్మిని చేపట్టిన శ్రీచెంచులక్ష్మిసమేత
రవ్వలకొండ మూర్తి , శ్రీపావన నరసింహ
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

 
శ్రీభానుడు ఛీకట్లు ప్రాలదోల సంసిద్ధుడైనాడు
ఇదిచూసి తెల్లవారనని కోడికూత కూసింది
కస్టాలు విన్నవించుకోను భక్తులు వేచివున్నరు
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

స్నానము చేయించ పన్నీరు జలము
బంగారు కళశాలతో సిద్దం శ్రీపావన నరసింహా
అభిషేకించను సర్వము తెచ్చాము శ్రీనరసింహా
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

పట్టువస్త్రములు తెచ్చాము శ్రీపావన నరసింహా
నైవేద్యకైంకర్యాలు సిద్ధం తండ్రీ
నీమూర్తి దర్శనానికి వేచివున్నారు శ్రీనరసింహ
మేలుకో మేలుకో మేలుకో మేలుకో

                                                                                       నీ మెలకవలోనే యీ జగతి నడవాలి                                                                                                                                                                         భక్తులంతా నీ ప్రేమతో పరవళ్ళుత్రొక్కాలి                                                                                          సర్చేసుఖినోభవంతు శ్రీపావన నరసింహ     

శాంతి మంత్రమే వేదపఠనం శ్రీపావన నరసింహా

మేలుకో మేలుకో మేలుకో    మేలుకో     

మేలుకో మేలుకో మేలుకో మేలుకో

2

కాలువ గట్టున కొండవుందిరా
కొండమీద గుడి వుందిరా
గుడిలోన నరహరి మూర్తిరా
కొండపైకి వచ్చావా తిరిగి వెళ్ళవురా

భక్తుల కోర్కెలు తీర్చె కల్పతరువు
వరాలజల్లు కురుపించే శ్రీహరి అవతారం
భోగభాగ్యల పంట పండించ వచ్చాడురా
సిరిసంపదలు నీ ఇంట నింపేనురా

ఎక్కడెక్కడో తిరగుకురా
రవ్వలకొండ నరహరిని వీడకురా
రెక్కలు కట్టుకుని రివ్వున వాలునురా
నిన్ను చుట్టిన సమస్యలు ప్రాలద్రోలేనురా

అనంత పద్మనాభుడాయనేనురా
తిరుమలగిరి వెంకన్నాయనేనురా
పట్టిన వారికి కొంగు బంగారమాయనేనురా

సమస్తము ఆయనేనురా

3

త్రికరణ శుద్దిగ శ్రీనరసింహున్ని కొలవండి
సకల సంపదలు పొందండి
ఏకాగ్రతో శ్రీపావనుని వేడండి
ఎక్కడలేని ఆనందము పొందండి

 
శ్రీస్వామి పదములు నిష్టగ పట్టండి
కష్టములన్నీ తీర్చుకొండి
శ్రీస్వామిని దయజూపమని దృష్టినిల్పి వేడండి
అష్టైశ్వర్యములు సిద్ధించుకొండి

శ్రీనరసింహునిని సర్వవేళల కొలవండి
వేదన మటుమాయము చేసుకొండి
 
శ్రీస్వామిని నిత్యము ఆరాధించండి
అన్ని శుభములు పొందండి

శ్రద్ధను జూపి శ్రీస్వామిని శరణు వేడండి
ముదములు మదిని నింపుకొండి
శ్రీస్వామి పదకమలము ప్రార్థించి పట్టండి
శ్రీచెంచులక్ష్మీసమేత పావనుని కృపని పొండండి

శ్రీచెంచులక్ష్మీసమేతున్ని కొలవండి
భవ,దు: దైన్యములు తీర్చుకొండి
శ్రీచెంచులక్ష్మీ పతిని స్తుతిచేయండి
ఇల్లు పొంగిపొర్లే సిరులు పొందండి

రవ్వలకొండ శ్రీనరసింహున్ని దర్శించండి
దారిద్ర తాపములు తీర్చుకొండి
శ్రీస్వామి సేవలొ నిత్యం తరించండి
సిరి,సంతోషము,సౌభాగ్యములు పొందండి

4

 నీ మూర్తి సేవచేయ నీ ముంగిట నిలిచాను
ఈ భాగ్యము ఈ మూర్తికి కలుగచేయి నా తండ్రి
రవ్వలకొండవాస శ్రీపావన నరసింహ

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక
ఆనంద శ్రీపావన ప్రహ్లాద వరదా
నవతీత హృదయ నృసింహరూపా
జగమేలు నా తండ్రి పావన నరసింహ

ఎన్నో జన్మల పుణ్యఫలమో నాస్వామీ
నీ మూర్తి వెలయించు భాగ్యము నిచ్చి
రవ్వలకొండను మరో పుణ్యక్షేత్రం చేసి
నీ చరణాల పట్టేభాగ్యము నిఛ్ఛిన దేవా

తల్లివి నీవే తండ్రివి నీవే  రవ్వలకొండ నిలయా
నా సర్వము నీవే ఏ కోరిక నిను కోరను
నా జీనితము నీకే అర్పితం పావన నరసింహా
నీ ధర్శనము కలగజేయి నా తండ్రి

5

అజ్ఞానపు అందకారములో నీ బిడ్డలమున్నాము
అనుగ్రహించు తండ్రీ జ్ఞాన తేజస్సును
చావు పుట్టుకలు మాయా మోసాలు
మరపించు స్వామీ మోక్షానికి మార్గాన్ని సుమగమం చేయి

క్షణమైన నిరీక్షించలేము క్షీరసాగరసాయి
గడియైనా గడవదు నిను తలచక దుష్ట సంహార
కనులు మూసిన నీవే పద్మలోచనా
మెలకవలోనూ నీ తలపే నరసింహా
ఇదే తపస్సు దురితదూర నరసింహ
ప్రతి అడుగు నీ కోసమే వైకుంఠదామ

నిదర్శనాలు ఎన్నొ ఎన్నో లెక్కకట్టగలమా
అదరము బెదరము మనోవాంచ సిద్ధిసంకల్పా
ఆపదలు భయాలు దరిచేరవు తండ్రీ
నీ భరోసా మాకు అండడండగ వుండగ
శ్రీ నరసింహా నమోనమ: నమోనమ:

6

పద్యము:     జుర్రేరు పుణ్య నదీ తీరాన
                  మూర్తియే భగీరథుడై
                 తేజొమయ భక్త జన రక్షకుడు
                 శ్రీ చెంచులక్ష్మీసమేత పావవనరసింహస్వామి
                 మూర్తిని ప్రతిష్ఠంపజేసి, భక్తజన హృదయుడై
                 జ్ణాన గంగను ప్రవహింపజేసే

స్వాగతం సుస్వాగతం
పరమ పావన స్వాగతం
పరమాత్మ పరందామ స్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

సర్వంతర్యామి సర్వేశ్వరా
మందర పర్వతాన్ని మూపున మోసి
అమరులకు అమృతాన్ని పంచి
విశ్వశాంతిని కాపాడిన శ్రీహరి అవతార
స్వాగతం సుస్వాగతం
పరమ పావన స్వాగతం
పరమాత్మ పరందామ స్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

భరతజాతి భాగ్యోదయ
సర్వజగతి సర్వోదయ
విశ్వాంబర స్వాగతం
సర్వేశ్వర సుస్వాగతం
పరమ పావన స్వాగతం
పరమాత్మ పరందామ స్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

జ్ఞాననేత్రదాత ఆత్మ స్వరూప
నవజీవనదాత సర్వాత్మ స్వరూప
సర్వశక్తిదాత ఆనంద స్వరూప
దివ్యశక్తి ప్రధాత పావన
ముక్తిదాత స్వాగతం
స్వాగతం సుస్వాగతం
పరమ పావన స్వాగతం
పరమాత్మ పరందామ స్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

సర్వాత్మ పరమపద భాగ్యవిధాత
మమ్ము అలరించే మాతపితవు
పరందాముడ పరమ పావన స్వాగతము

పరమాత్మ పరందామ స్వాగతం
స్వాగతం సుస్వాగతం
స్వాగతం సుస్వాగతం

7

 అహో రవ్వలకొండ శ్రీనరసింహ శ్రీచెంచులక్ష్మీసమేతా
బ్రహ్మగారు నడయాడిన చోట వెలసిన పావన నరసింహ
మమ్ముల ధన్యుల చేశావయ్యా

పల్లవి: కొండపై నీమూర్తి ప్రతిష్టించినారు నీభక్తులందరూ
రవ్వలకొండకే అందాలు తెచ్చినారు

చరణం: కనుచూపు కరువైనవారికి చూపునొసగినావు
సంతానములేని వారికి వంశాన్నిచ్చావు
ఎందరో భక్తుల మనొభీష్టాలు తీర్చావు స్వామీ

ఒకవైపు జలజలపారే కాలువ ఆ వైపే జుర్రేరు
మరోవైపు బ్రహ్మముగారు కాలజ్ఞానము రాసిన గవి
ప్రక్కనే లింగమూర్తి మఠమూ ఆ ప్రక్కనే క్రిష్ణమందిరము
వరాలజల్లు కురిపించు రవ్వలకొండకు వచ్చాము
కష్టాలు తీరలేదని కలతపడవలదు
నమ్ముకో నిను తప్పక దరిచేర్చును స్వామీ

రవ్వలకొండపై చెంచులక్ష్మి సమేతుడై
పావన నరసింహుడు మూర్తి ప్రతిష్టుడు కాగా
ప్ర్తతి స్వాతికి ప్రత్యేక పూజలంచుకొను స్వామీ
భక్తుల మనోరూపము పుట్టశిలలో చూపలేదా స్వామీ

కాలము మారిన సృష్టి తలక్రిదులైన నీవే
నిత్యమై సత్యమై నిలిచి వుందువు
ఇది నిజము పావన నరసింహస్వామీ

8

నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
నా ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా
తల్లిదండ్రి సర్వము  నీవేనయ్యా
మనసారా ఒక్కసారి పిలవాలయ్యా
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
నా ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా

నన్ను వదిలివెల్లింది మా అమ్మ నీకోసం
నీకు సేవచేసే మహాభాగ్యం నాకు యిచ్చింది
నన్ను వదిలివెల్లింది మా అమ్మ  నీకోసం
నీకు సేవచేసే మహాభాగ్యం నాకు యిచ్చింది
నీకథలెన్నో చేప్పింది నీ దగ్గరకు చేర్చింది
నా కన్నీరు తుడిచేవని నీ తోడు నాకు యిచ్చింది
నాతో  మౌనంగా వుంటే ఎట్లయ్యా
నన్ను మరచి రవ్వలకొండపై శిలవైతే ఎట్లయ్యా
నాతో  మౌనంగా వుంటే ఎట్లయ్యా
నన్ను మరచి రవ్వలకొండపై శిలవైతే ఎట్లయ్యా
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
ఎదచాటు వెతలు విన్నవించాలయ్యా 
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
నా ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా

నీనామము ప్రతిక్షణం ధ్యానిస్తు వున్నాను
నీకోరకు మరల జన్మించాలని వుందయ్యా
నీనామము ప్రతిక్షణం ధ్యానిస్తు వున్నాను
నీకోరకు మరల జన్మించాలని వుందయ్యా
నన్ను కరుణించే దేవుడవు నీవేనయ్యా
వెతలు తీర్చే నరహరివి నీవయ్యా
నన్ను మరచి రవ్వలకొండపై శిలవైతే ఎట్లయ్యా
నాతో  మౌనంగా వుంటే ఎట్లయ్యా
నన్ను మరచి రవ్వలకొండపై శిలవైతే ఎట్లయ్యా
నాతో  మౌనంగా వుంటే ఎట్లయ్యా
తల్లిదండ్రి సర్వము నీవయ్యా
మనసారా ఒక్కసారి పిలవాలయ్యా
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా
నరహరి నిన్ను ఒక్కసారి దర్శించాలయ్యా
నా ఎదచాటు వెతలు  విన్నవించాలయ్యా

9

వచనము: అందరూ రండి. స్వాతి వచ్చేసింది. స్వామివారిని సేవిద్దాము.ప్రత్యేక వేడుకలు చేద్దాము. రండి రండి

రారాండోయి రారాండోయి
స్వాతి వేడుకలు చూద్దాము
స్వామివారిని సేవిద్దాము
అమ్మవారి దీవెనలు పొందుదాం
ఆడుదాం పాడుదాము రారండోయి

తెలతెల వారుతొంది
మేలుకొలుపు పాడుదాం
చెంచులక్ష్మీ సమేతున్ని
పావన నరసింహస్వామిని
కంటినిండ ఆశలతో కొలుద్దాం

రారాండోయి రారాండోయి
స్వాతి వేడుకలు చూద్దాము
స్వామివారిని సేవిద్దాము
అమ్మవారి దీవెనలు పొందుదాం
ఆడుదాం పాడుదాము రారండోయి

వారు వీరని తేడాలొద్దు
అందరము ఒకటే సైన్యమై
రవ్వలకొండపైకి నడుద్దాం
ఒకేమాటగా ఒకటే పరివారమై
నరసింహనాయకున్ని కొలుద్దాం

రారాండోయి రారాండోయి
స్వాతి వేడుకలు చూద్దాము
స్వామివారిని సేవిద్దాము
అమ్మవారి దీవెనలు పొందుదాం
ఆడుదాం పాడుదాము రారండోయి

కనువిందైన యీ చలువ పందిరిలో
కలిసిమెలిసి ఆడుదాము పాడుదాము
స్వాతివేడుకలు ఘనంగా చేద్దాం
స్వామివారి దీవెనలు పొందుదాం
ఆడుదాం పాడుదాం రారండోయి

రారాండోయి రారాండోయి
స్వాతి వేడుకలు చూద్దాము
స్వామివారిని సేవిద్దాము
అమ్మవారి దీవెనలు పొందుదాం
ఆడుదాం పాడుదాము రారండోయి

10

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

ఉగ్రనరసింహునిగ అవతరించితివి
హిరణ్యకశిపున్ని తుదముట్టించితివి
ప్రహ్లాదున్ని బ్రోచితివి భక్తుల మనసు దోసితివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

చెంచులక్ష్మీని చేపట్టితివి
చెంచులక్ష్మీసమేతుడవైతివి
రవ్వలకొండపై కొలువైతివి
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

అర్చన చేద్దాము
మనసు అర్పన చేద్దాము
స్వామికి మదిలో కోవెల కడదాం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

స్వామిని పూజించే చేతులే చేతులు
శ్రీమూర్తిని దర్శించే కన్నులే కన్నులు
శ్రీహరి కథలు విన్న చెవులే చెవులు
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

రవ్వలకొండ శ్రీనరసింహునికి జయమంగళం
మా తండ్రీ శ్రీ నరహరికి శుభమంగళం
మా అమ్మ చెంచులక్ష్మీకి నిత్యమంగళం
నిత్యం కొలిచే దైవం శ్రీ నరసింహస్వామికి
మంగళం జయమంగళం మంగళం శుభమంగళం

11

నీ నామము ఓ దివ్య మంత్రం
నరసింహ నీ దివ్య నామమంత్రం
పరమ పుణ్యదామము అదే మోక్షమార్గం

కొండలు కోనలే నీనెలవులు మా స్వామి
నీ చరణాలే మాకు నెలవు మా తండ్రీ
నీ నామ స్మరణం తీర్చు మా ఇక్కట్లు మాస్వామీ
నీ పాదసేవనం తీర్చు రోగబందములు మా తండ్రీ
నీ దాసులము మేము మా స్వామీ
భక్తవరుల దాసులకు దాసుడవు మా తండ్రీ
శరణం శరణం నమో నారాయణ
నీ నామము ఓ దివ్య మంత్రం
నరసింహ నీ దివ్య నామమంత్రం
పరమ పుణ్యదామము అదే మోక్షమార్గం


విధ్యను నేర్చితిమి నిన్ను కీర్తించను నా స్వామీ
మా జన్మ చేయుమయ్యా పావనము మా తండ్రీ
భోగభాగ్యములు మాకొద్దు నరసింహా
ముక్తిని ప్రసాదించు చెంచులక్ష్మీసమేత
చిత్తశుద్ధిగా నీ సేవచేయు భాగ్యం నివ్వు మా స్వామీ
నీ నామము ఓ దివ్య మంత్రం
నరసింహ నీ దివ్య నామమంత్రం
పరమ పుణ్యదామము అదే మోక్షమార్గం

నదుల మునగలేము చల్లటీ స్నానముచేయ మా స్వామీ
నడవలేను తీర్థయాత్రలు చేయ మా తండ్రీ
ధనములేదు ధానధర్మములు చేయ మా స్వామీ
మనస్సు నిలవదు తపస్సు చేయ మా తండ్రీ
చేతకాదు కష్టములుకోర్చ మా స్వామీ
నిత్యం చేయగలము నీ దివ్యనామ స్మరణ మా తండ్రీ
నీ నామము ఓ దివ్య మంత్రం
నరసింహ నీ దివ్య నామమంత్రం
పరమ పుణ్యదామము అదే మోక్షమార్గం

12

చింతలేలరా దిక్కులేనివాడిలా
దక్కని బందాల కోసం
ఉన్నాడురా శ్రీ పావనుడు
నమ్ముకో గమ్యాన్ని చేరుకో

తలదించుకోక తప్పదురా
నిన్ను వొద్దనుకున్న నీవారంతా
భవిష్యత్తంతా నీదేనురా
శ్రీనరసింహుడు నీ అండవుండగా
నమ్ముకో గమ్యాన్ని చేరుకో

నీటిని పారబోసినట్లుగా మాటలు తూలితే
తీసికోగలమా తిరిగి వెనక్కి
ఆచి తూచి మాట్లాడు దైవము నీవెంటేరా
శ్రీనరహరి నీ వెన్నుదన్నురా
నమ్ముకో గమ్యాన్ని చేరుకో

పుట్టుగుడ్డి తనాన్ని నయము చేయవచ్చురా
అహంకారముతో కళ్ళుపొరలు గమ్మినతనాన్ని
నయము చేయలేమురా
మంచివాడికే చెడ్డవాడంటుందీ లోకంరా
నటనచేసేవాడికే జేజేలు పలుకునురా యీ లోకం
అన్నిటికి ఆ దైవమే సమాదానమిచ్చురా
నమ్ముకో గమ్యాన్ని చేరుకో

vishi.mp3